అమిత్ షాకు జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు
- నేడు అమిత్ షా జన్మదినం
- దేశ నలుమూలల నుంచి వెల్లువెత్తిన విషెస్
- సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పవన్
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. "గౌరవనీయులైన హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవాలు, స్పష్టత, దృఢ నిబద్ధతతో పార్లమెంటులో ప్రభావవంతమైన స్వరంతో ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చే మీ సామర్థ్యం నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణం" అని కొనియాడారు.
"ఈ ప్రత్యేకమైన రోజున అమిత్ షా గారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ధైర్యం ప్రసాదించమని శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. దేశ సేవలో ఆయన ఎల్లప్పుడూ అచంచలంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.