పిల్లల మెదడుపై తండ్రి 'టెన్షన్'
తనతోనే పోతుందనుకుంటే పర్వాలేదు. తన పిల్లలకూ అది శాపంగా మారుతుందంటే.. యువకులు ఇకపై జాగ్రత్తపడాల్సిందే. ఆధునిక యుగంలో ప్రధాన సమస్య అయిన ఒత్తిడిపై కొత్తగా వెలువడిన ఓ పరిశోధన ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. యువకులుగా ఉన్నప్పుడు ఉండే ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం వారి వీర్యంపై పడుతుందట. దీంతో వారి పిల్లల మెదడు ఎదుగుదల విషయంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పెన్సెల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులు జరిపిన పరిశోధనలో తేలింది.