పలమనేరు ఎస్సై లోకేశ్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం... వీడియో ఇదిగో!
- పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ హల్చల్
- అక్రమ నిర్మాణమంటూ జేసీబీతో వెళ్లి భవనం కూల్చివేతకు యత్నం
- అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట
- "ఎవడ్రా నువ్వు" అంటూ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించిన వైనం
- దాడికి యత్నించిన మాజీ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలుంటాయని పోలీసుల హెచ్చరిక!
చిత్తూరు జిల్లాలోని పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పోలీసుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను "ఎవడ్రా నువ్వు" అంటూ దూషిస్తూ, ఆయనపై దాడికి యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. పలమనేరు పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ఒక ప్రైవేటు స్థలంలో జరుగుతున్న భవన నిర్మాణం అక్రమమంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తన అనుచరులతో కలిసి మంగళవారం అడ్డుకున్నారు. జేసీబీతో అక్కడికి చేరుకుని, నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భవన యజమాని ఆయనను నిలువరించడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పలమనేరు ఎస్సై లోకేశ్, సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల జోక్యంపై వెంకటేగౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై లోకేశ్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మాటలతో ఆగకుండా ఆయనపైకి దూసుకెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన ఇతర పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు సమాచారం.