దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి మృతి
- కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ మృతి
- దక్షిణాఫ్రికాలో బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్
- కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన స్థానికులు
దక్షిణాఫ్రికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలో బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నాడు అతను చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.
శ్రీనివాస్ మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు, తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.