జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం: చిన్న హోటల్లో టిఫిన్ చేసిన బీజేపీ అధ్యక్షుడు

  • ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు
  • దీపక్ రెడ్డి తరఫున బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రచారం
  • నేడు నామినేషన్లకు చివరి రోజు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన ఒక హోటల్‌లో అల్పాహారం స్వీకరించారు.

నామినేషన్ దాఖలు చేసిన లంకల దీపక్ రెడ్డి

ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వెంకటగిరిలోని విజయపోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచందర్ రావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో షేక్‌పేట తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

లంకల దీపక్ రెడ్డి గత 2023 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం వరకు 13 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.


More Telugu News