Vijay: కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

Actor Vijay Gets CBI Notice Again in Karur Stampede Case
  • ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని పేర్కొన్న సీబీఐ
  • ఈ కేసుకు సంబంధించి జనవరిలో పలుమార్లు విచారణకు హాజరైన విజయ్
  • తాము సేకరించిన ఆధారాలపై విజయ్ స్పష్టత ఇవ్వాల్సి ఉందని తాజా నోటీసులు
గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది.

గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

దర్యాప్తులో భాగంగా జనవరిలో విజయ్‌ని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఇప్పటి వరకు తాము సేకరించిన ఆధారాలపై విజయ్ స్పష్టతనివ్వాల్సి ఉండటంతో అతడికి మరోసారి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ర్యాలీ కోసం ఏర్పాట్లు, వేదికకు మంజూరు చేసిన అనుమతులు, టీవీకే పార్టీ, తమిళనాడు ప్రభుత్వం వాదనలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Vijay
Karur Stampede
TVK Party
CBI Investigation
Tamil Nadu Politics
Public Rally Deaths

More Telugu News