హైదరాబాద్‌లోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

  • కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
  • ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ పరిశ్రమలో ప్రమాదం
  • రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం
హైదరాబాద్‌ నగరంలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ కవర్ల తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాలిమర్ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాల సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News