శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 2.37 కోట్ల విలువైన బంగారం పట్టివేత

  • కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు
  • డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో 7 బంగారు కడ్డీలు గుర్తింపు
  • 1.8 కిలోల బరువు ఉన్న ఈ కడ్డీల విలువ రూ. 2.37 కోట్లు ఉంటుందని అంచనా
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్‌ చేరుకున్న ఒక ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా, అతని వద్ద 7 బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి.

సుమారు 1.8 కిలోల బరువున్న ఈ బంగారు కడ్డీల విలువ సుమారు రూ. 2.37 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 5 బంగారు బిస్కట్లు, రెండు కట్ పీసులు ఉన్నాయి. అధికారులకు అనుమానం రాకుండా వాటిని లగేజీ డోర్ మెటాలిక్ లాక్‌లో కొంత భాగాన్ని, అలాగే పొద్దు తిరుగుడు గింజలు ఉన్న ప్లాస్టిక్ పౌచ్‌లో మరికొంత బంగారాన్ని దాచి తరలించే ప్రయత్నం చేశాడు.


More Telugu News