సామాజిక మాధ్యమాల్లో అలాంటి వార్తలు షేర్ చేయొద్దు: తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తను యథాలాపంగా షేర్ చేయవద్దని సూచన
- ఫార్వార్డ్ చేసే ముందు ఆలోచించాలని సూచన
- తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్న తెలంగాణ పోలీసులు
తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల వినియోగదారులకు హెచ్చరిక జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్తను లేదా సమాచారాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించకుండా, నిజానిజాలు నిర్ధారించుకోకుండా గుడ్డిగా ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ప్రకటన విడుదల చేశారు.
తప్పుడు సమాచారాన్ని తొందరపడి ప్రచారం చేయరాదని, వార్తల్లోని సత్యాసత్యాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని ఇతరులతో పంచుకోవాలని సూచించారు.
అసత్య వార్తల ప్రచారంలో భాగస్వాములు కావొద్దని హితవు పలికారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సెన్షేషనలిజం కోసం ప్రయత్నించవద్దని 'ఎక్స్' వేదికగా సూచించారు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటున్నారా.. జాగ్రత్త
క్రెడిట్ కార్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కార్డు లిమిట్ పెంచుతామని మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ లింక్స్ పంపి మోసగించే అవకాశం ఉందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎప్పుడూ ఓటీపీ అడగరని, క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.