Abhishek Bachchan: ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటూ భార్య ఐశ్వర్యపై అభిషేక్ పొగడ్తలు

Abhishek Bachchan Praises Wife Aishwarya at Filmfare Award Ceremony
షార్ట్స్‌లో చూడండి
పాతికేళ్ల సినీ ప్రయాణంలో తన ప్రతీ విజయం వెనక భార్య ఐశ్వర్య రాయ్ ఉందని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అభిషేక్.. వేదికపై తన భార్య ఐశ్వర్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ అవార్డు గెలుచుకోవడానికి ఐశ్వర్య ప్రధాన కారణమని అన్నారు. ‘ఐ వాంట్‌ టు టాక్‌’ చిత్రంలో నటనకు గానూ అభిషేక్‌ బచ్చన్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

ఈ అవార్డును కుమార్తె ఆరాధ్యకు, తండ్రి అమితాబ్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ముందు ఈ అవార్డు స్వీకరించడం తనకు రెట్టింపు సంతోషంగా ఉందన్నారు. ‘ఐ వాంట్‌ టు టాక్‌’ దర్శకుడికి, తనను 25 ఏళ్లుగా ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తాను ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చానని, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అభిషేక్ బచ్చన్ చెప్పారు.
Go Back to Shorts
Abhishek Bachchan
Aishwarya Rai
Filmfare Award
I Want to Talk
Amitabh Bachchan
Bollywood actor
Best Actor
Aaradhya Bachchan
Bollywood film

More Telugu News