భాగ్యనగరంలో ఎకరం భూమి రూ. 177 కోట్లు పలికిందంటేనే అర్థం చేసుకోవచ్చు: మల్లు భట్టి విక్రమార్క
- హైటెక్స్‌లో జరిగిన నరేడ్కో ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
- హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న భట్టివిక్రమార్క
- ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు కల్పించినట్లు వెల్లడి
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వేలంలో ఎకరం భూమి రూ. 177 కోట్లకు అమ్ముడుపోవడం నగర రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ నరేడ్కో ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రతి సంవత్సరం పట్టణాభివృద్ధి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్‌లో రూ. 10,000 కోట్లు కేటాయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం దాదాపు రూ. 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరే ఇతర నగరంలో లేని విధంగా హైదరాబాద్‌లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా జరుగుతోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో నగరంలో ఎలక్ట్రికల్ బస్సులే నడుస్తాయని ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. రియల్టర్లు, బిల్డర్లను సంపద సృష్టికర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన అన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.