హైదరాబాద్‌‍లో రూ.1 కోటి విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసులు

  • మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, కీసర పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్ స్వాధీనం
  • డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒకరి అరెస్టు, మరో నిందితుడి కోసం గాలింపు
హైదరాబాద్ నగరంలో రాచకొండ పోలీసులు రూ. 1 కోటి విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

డ్రగ్స్ ముఠా డబ్బు బదిలీ నెట్‌వర్క్ బట్టబయలు

రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగిల్ టీమ్ మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించింది. నైజీరియా డ్రగ్స్ ముఠా డబ్బు బదిలీ నెట్‌వర్క్‌ను ఛేదించింది. డ్రగ్స్ దందాకు సంబంధించిన రూ. 3 కోట్ల హవాలా డబ్బును ముంబైలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ ముఠాల డబ్బు బదిలీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. నకిలీ పాస్‌పోర్టులతో విదేశీయులు భారత్‌లోకి వస్తున్నట్లు ఈగిల్ టీమ్ గుర్తించింది.


More Telugu News