బీసీ రిజర్వేషన్ల అంశం.. ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రేవంత్ రెడ్డి ఫోన్!
- బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- హైకోర్టులో వాదనలు వినిపించాలని సింఘ్వీని కోరిన ముఖ్యమంత్రి
- హైకోర్టులో రేపు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని ఆయనను కోరారు.
రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈరోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. రేపు హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై వారు చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.