ప్రకాశం జిల్లాలో రెండు తలల దూడ జననం

Two Headed Calf Born in Andhra Pradesh Prakasam District
  • జన్యుపరమైన కారణాల వల్లేనని వైద్యుల వివరణ
  • అత్యంత అరుదుగా చోటుచేసుకుంటాయని వెల్లడి
  • దూడ ఆరోగ్యంగా ఉందని పేర్కొన్న పశు వైద్యుడు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ వింత దూడ జన్మించింది. అసాధారణంగా ఈ దూడకు రెండు తలలు ఉన్నాయి. జిల్లాలోని పొదిలి మండలం గురవాయపాలెంలో చోటుచేసుకుందీ ఘటన. రైతు అన్నపురెడ్డి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో పెంచుకుంటున్న గేదె ఇటీవల ఓ దూడకు జన్మనిచ్చింది.

అయితే, దూడకు రెండు తలలు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యానని, వెంటనే పశువైద్యుడు బ్రహ్మయ్యకు సమాచారం అందించానని వెంకటరెడ్డి తెలిపారు. దూడను, గేదెను పరిశీలించిన బ్రహ్మయ్య.. జన్యుపరమైన లోపాల వల్ల అత్యంత అరుదుగా ఇలాంటి దూడలు పుడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు తలల దూడ ఆరోగ్యంగానే ఉందని వివరించారు. కాగా, ఈ వింత దూడను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.
Go Back to Shorts
Annabu Reddy Venkata Reddy
Prakasam district
two headed calf
rare calf birth
genetic anomaly
Podili mandal
Guravayapalem
Andhra Pradesh

More Telugu News