అరుణాచలంలో ఘోరం.. ఆంధ్ర యువతిపై పోలీసుల అత్యాచారం
- టమాటాల లారీ ఆపి ఇద్దరు కానిస్టేబుళ్ల అఘాయిత్యం
- విచారణ పేరుతో యువతిని పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం
- బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి చేర్చిన స్థానికులు
సమాజంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటన తిరువణ్ణామలై (అరుణాచలం)లో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి (18) అనే యువతి టమాటాలు రవాణా చేస్తున్న ఒక గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తోంది. సోమవారం రాత్రి ఎంథాల్ బైపాస్ వద్ద రౌండ్స్‌లో ఉన్న సుందర్, సురేశ్ రాజ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ వాహనాన్ని తనిఖీ కోసం ఆపారు. వాహనంలో ఉన్న యువతిపై అనుమానం ఉందంటూ, విచారణ చేయాలని ఆమెను బలవంతంగా కిందకు దించారు.
అనంతరం, ఆమెను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. యువతి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి కానిస్టేబుళ్లు పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని రక్షించి, అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడటంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.