రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి 18 ఏళ్లు... చిరంజీవి స్పందన

  • ఆ క్షణం నాన్నగా మర్చిపోలేను.. చరణ్‌పై చిరు ఎమోషనల్ ట్వీట్
  • చరణ్ క్రమశిక్షణ, అంకితభావంపై ప్రశంసలు
  • తండ్రిగా ఎప్పుడూ గర్వపడతానన్న మెగాస్టార్
  • ఈ సందర్భంగా 'పెద్ది' మూవీ కొత్త పోస్టర్ విడుదల
  • సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని, గర్వాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కుమారుడి విజయవంతమైన ప్రయాణాన్ని చూసి ఓ తండ్రిగా తాను ఎంతగా మురిసిపోతున్నారో వివరిస్తూ నేడు ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ, "చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో నిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాను. నిన్ను మొదటిసారి హీరోగా తెరపై చూసిన ఆ క్షణాన్ని ఓ తండ్రిగా నేనెప్పటికీ మర్చిపోలేను" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్‌లోని క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, వినయం వంటి లక్షణాలే అతడిని ఈ స్థాయిలో నిలబెట్టాయని కొనియాడారు. "దేవుడి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానంతో నువ్వు మరెన్నో శిఖరాలను అధిరోహించాలి" అంటూ చిరంజీవి తన కుమారుడికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం 'పెద్ది' టీమ్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆ పోస్ట్ లో ప్రకటించారు. 

ఈ పరిణామాలతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో #18YearsOfRAMCHARANsGlory, #Peddi వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో సందడి చేస్తున్నారు. 


More Telugu News