త్వరలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం: కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి
- ఇరుదేశాలకు మేలు చేసేలా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
- చర్చలు సానుకూల దృక్పథంతో కొనసాగుతున్నాయన్న వాణిజ్య శాఖ
- త్వరలో ఒప్పందం ఖరారవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడి
అమెరికాతో వీలైనంత త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ తెలియజేసింది. ఇరు దేశాలకు మేలు చేకూరేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. వాణిజ్య సమస్యలపై చర్చల కోసం అమెరికాకు వెళ్లిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల దృక్పథంతో కొనసాగుతున్నాయని, ఈ చర్చలు ఫలప్రదమై త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నట్లు పేర్కొంది.
వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై భారత ప్రతినిధి బృందం అమెరికా ప్రభుత్వంతో నిర్మాణాత్మక సమావేశాలు నిర్వహించినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికా కూడా భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవాలనే ఆలోచనను వ్యక్తం చేసినట్లు తెలిపింది.
భారత్‌తో టారిఫ్ చర్చలు గొప్పగా జరుగుతున్నాయని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. ఇరు దేశాలు సమష్టిగా ప్రయోజనాలను గుర్తించినట్లు తెలిపారు.