ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్పందించిన నాగార్జున
- ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున
- తన వ్యక్తిత్వ హక్కులను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపిన నాగార్జున
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన నటుడు
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆధునిక డిజిటల్ యుగంలో తన వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించినందుకు కృతజ్ఞతలు అంటూ ఢిల్లీ హైకోర్టుకు 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్, న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైశాలి, సోమ్‌దేవ్ తమ వాదనలను బలంగా వినిపించారని ఆయన పేర్కొన్నారు. తన తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించినందుకు నాగార్జున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న వారిని నిలువరించాలంటూ నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించి కొందరు వ్యాపారాలు చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా, తన ఫొటోలు, వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి తన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.