Tejas: మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్‌‍లు.. హెచ్ఏఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం

Tejas to Replace MiG21 Jets Defense Deal with HAL
షార్ట్స్‌లో చూడండి
భారత వాయుసేనలో తేజస్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. రక్షణ శాఖ... దశాబ్దాలుగా కీలక సేవలు అందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికి వాటి స్థానంలో తేజస్ జెట్లను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన నెలలోపే ఈ ఒప్పందం ఖరారైంది.

మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ ఎంకే-1ఏ తేజస్ జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉండనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్‌లలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థలతో పాటు కంట్రోల్ యాక్యుయేటర్‌లు ఉంటాయి. వీటిలో 64 శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

2027-28 నుండి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు రాబోయే ఆరేళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.
Go Back to Shorts
Tejas
Tejas fighter jets
MiG-21 replacement
Hindustan Aeronautics Limited
HAL
Indian Air Force

More Telugu News