వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట

  • హెడ్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ 
  • నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఘటన 
  • రూ.50వేల బాండ్‌తో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి 
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హెడ్‌కానిస్టేబుల్‌కు విధుల్లో ఆటంకం కలిగించి దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
రూ.50వేల బాండ్‌తో రెండు పూచికత్తులు సమర్పించాలని పిటిషనర్‌కు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తీర్పు వెలువరించారు.  
 
కేసు నేపథ్యం
 
వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో, కోవూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య ఫిర్యాదు ఆధారంగా దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.  
 
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ప్రసన్నకుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేశారు. 


More Telugu News