రాజశేఖర్ ఆ రీమేక్ చేస్తున్నది నిజమేనా?

  • రాజశేఖర్ నుంచి వచ్చిన గ్యాప్ 
  • విలన్ పాత్రల వైపు వెళ్లని హీరో 
  • రీమేకులపై దృష్టిపెట్టిన రాజశేఖర్ 
  • తెరపైకి తమిళ రీమేక్ గా 'లబ్బర్ పందు'   

రాజశేఖర్ .. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా ఆయనకు గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలంటే ముందుగా రాజశేఖర్ డేట్స్ ఖాళీ ఉన్నాయో లేదో చూసేవారు. యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు, ఆ తరువాత ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తనవైపుకు తిప్పుకోగలిగారు. ఆయన కెరియర్ లో భారీ విజయాలే కనిపిస్తాయి. 

అలాంటి రాజశేఖర్ ఈ మధ్య కాలంలో హీరోగా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సరైన విలన్ రోల్ వస్తే చేస్తానని రాజశేఖర్ చెబితే, ఆ వైపు నుంచి కూడా అభిమానులు ఎదురు చూశారు. కానీ ఆ ట్రాకులో రాజశేఖర్ ఎక్కడా కనిపించడం లేదు. హీరోగా చేయడానికే ఆయన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. అవసరమైతే రీమేకులను ఆశ్రయిస్తున్నారు. లాస్ట్ టైమ్ హీరోగా ఆయన చేసిన 'శేఖర్' కూడా మలయాళ నుంచి తీసుకున్న కథనే. 

రాజశేఖర్ తెరపై కనిపించి చాలా కాలమే అవుతుంది. కొత్తగా ఆయన ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఓ తమిళ రీమేక్  ద్వారా ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. తమిళంలో అటు థియేటర్స్ లో .. ఇటు ఓటీటీలోను ఆదరణ పొందిన ఆ సినిమా పేరే 'లబ్బర్ పందు' (రబ్బరు బంతి). ఈ సినిమా రీమేక్ తోనే రాజశేఖర్ బిజీగా ఉన్నాడని అంటున్నారు. ఓటీటీలో చాలామంది చూసేసిన  ఈ సినిమా రీమేక్ ను ఆయన ఎంచుకోవడమే అభిమానులను ఆలోచనలో పడేసిన అంశం.



More Telugu News