బికినీలో సాయి పల్లవి... నిజమా? కాదా?... ఫ్యాక్ట్ చెక్!
- సోషల్ మీడియాలో సాయి పల్లవి బికినీ ఫొటోల కలకలం
- గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే సాయి పల్లవి ఇమేజ్‌కు భిన్నంగా ఫొటోలు
- ఫ్యాక్ట్ చెక్ ... ఇవి కొందరు ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫొటోలు
సహజ నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సినీ నటి సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. తన సినిమాల్లో గ్లామర్ పాత్రలకు, ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే ఆమె, బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బికినీలో సాయి పల్లవి ఏమిటని షాక్‌కు గురవుతున్నారు.
అయితే, ఈ ఫొటోలు నిజమైనవి కాదని తెలుస్తోంది. కొందరు ఏఐని ఉపయోగించి ఈ ఫొటోలను తయారు చేశారు. సోషల్ మీడియాలో సాయిపల్లవి సోదరి పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను కొదరు ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి... సాయి పల్లవి బికినీ ధరించినట్టుగా ఫొటోలను క్రియేట్ చేశారు. ఈ ఫేక్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.