హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ద్విచక్ర వాహనాలు

  • మెహదీపట్నం, టోలీచౌకి, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలు
  • లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
  • మెహిదీపట్నం నుండి ఎన్ఎండీసీకి 40 నిమిషాల సమయం!
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంకు, టోలీచౌకి, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు నీటి ప్రవాహానికి గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. అమీర్‌పేటలోని గ్రీన్ పార్కు హోటల్ వద్ద రోడ్డు సైతం చెరువులా మారింది.

భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సాయంత్రం మెహిదీపట్నం నుంచి ఎన్ఎండీసీకి చేరుకోవడానికి సుమారు 40 నిమిషాల సమయం పట్టింది. పలు కూడళ్లలో వాహనాలు బారులు తీరడంతో కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి. టోలీచౌకీ, హకీంపేట ప్రాంతాల్లో కొన్ని గోడలు కూలిపోయాయి.


More Telugu News