హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం
- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
- పలు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నిలిచిన నీరు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌పేట మొదలైన ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్ - రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.