అంపైర్లకు మాత్రమే షేక్ హ్యాండ్.. గంభీర్ మార్క్ స్ట్రాటజీ!

  • భారత్-పాక్ మ్యాచ్‌లో ముదిరిన షేక్ హ్యాండ్ వివాదం
  • అంపైర్లకే షేక్ హ్యాండ్ పరిమితం 
  • కోచ్ గంభీర్ సూచన మేరకే ఈ నిర్ణయం
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ముదురుతోంది. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. నిన్న‌ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లోనూ ఇదే సీన్ పునరావృతమైంది. అయితే, ఈసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు ఒక చిన్న మార్పు చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లతో కాకుండా, కేవలం అంపైర్లతో మాత్రమే షేక్ హ్యాండ్ చేయాలని గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చి ఆటగాళ్లకు సూచించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనతో ఇరు జట్ల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది.

మ‌రోవైపు, భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను పదేపదే 'రైవల్రీ'గా అభివర్ణించడంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఏకపక్షంగా సాగుతున్న పోటీని గొప్ప 'రైవల్రీ' (సమాన ప్రత్యర్థి)  అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News