'బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్' వివరాలు వెల్లడించిన దిల్ రాజు
- టీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్స్, పాటల పోటీలు
- లక్ష నుంచి మూడు లక్షల వరకూ బహుమతులు
- ఎంట్రీలను ఈ నెల 30వ తేదీలోపు పంపాలన్న దిల్ రాజు
తెలంగాణ యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కళల పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరుతో షార్ట్ ఫిల్మ్స్, పాటల పోటీలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నిన్న విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పాలన, సంక్షేమ పథకాలు, సంస్కృతి, చరిత్ర, పండుగలు, కళారూపాలు వంటి అంశాలను ఇతివృత్తాలుగా స్వీకరించి యువత ఈ పోటీలలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
నిబంధనలు:
* పోటీలో పాల్గొనే వారి వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి.
* షార్ట్ ఫిల్మ్స్ గరిష్ఠంగా 3 నిమిషాలు, పాటలు గరిష్ఠంగా 5 నిమిషాల నిడివి కలిగి ఉండాలి.
* వీడియోలు 4K రిజల్యూషన్‌లో ఉండాలి.
* సమర్పించే కంటెంట్ పూర్తిగా నూతనంగా ఉండాలి. గతంలో ఎక్కడా ప్రదర్శించని, ప్రత్యేకంగా ఈ పోటీ కోసం రూపొందించినదై ఉండాలి.
బహుమతులు:
* ప్రథమ బహుమతి: రూ.3 లక్షలు
* ద్వితీయ బహుమతి: రూ.2 లక్షలు
* తృతీయ బహుమతి: రూ.1 లక్ష
* కన్సోలేషన్ బహుమతులు: ఐదుగురికి రూ.20,000 చొప్పున
* విజేతలందరికీ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేయబడతాయి.
ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025. పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు తమ వీడియోలను ఈ మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
* ఈమెయిల్: youngfilmmakerschallenge@gmail.com
* వాట్సాప్ నంబర్: 81258 34009 (వాట్సాప్‌కు మాత్రమే ఎంట్రీలు పంపాలి)
స్వీకరించిన ఎంట్రీలను నిపుణుల బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది.