Jayam Ravi: రవి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ప్రపంచమే మారిపోయింది: కెనిషా

Jayam Ravi changed my world says Kenisha
  • జయం రవి, కెనిషా రిలేషన్ లో ఉన్నట్టు ప్రచారం
  • తన పుట్టినరోజును రవితో కలిసిన జరుపుకున్న కెనిషా
  • ఇప్పుడు తన ఆలోచనా విధానం కొత్తగా ఉందన్న గాయని
ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి, గాయని కెనిషా రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా కనిపించారు. తాజాగా, కెనిషా ఈ నెల 7న తన పుట్టినరోజు వేడుకలను రవితో కలిసి జరుపుకుంది. ఆ సందర్భంగా దిగిన ఫొటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, జయం రవి గురించి భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. 

తనను చిన్నప్పటి నుంచి ఎవరూ ఒక మనిషిగా గుర్తించలేదని కెనిషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరూ తనను దూరం పెడుతున్నారనే భావన తనలో ఉండేదని చెప్పింది. వారి నుంచి తాను కేవలం కొంత ప్రేమ, గౌరవ మర్యాదలు మాత్రమే కోరుకున్నానని తెలిపింది. జయం రవి తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని పేర్కొంది. ఇప్పుడు ఆలోచనలు, వ్యవహారశైలి, ప్రేమ వంటి విషయాల్లో తన ఆలోచనా విధానం కొత్తగా ఉందని తెలిపింది.
Jayam Ravi
Kenisha
Kenisha birthday
Jayam Ravi Kenisha relationship
Kollywood actor
Singer Kenisha
Tamil cinema
Love and respect
Social media post
Relationship news

More Telugu News