Ambati Rambabu: సత్తెనపల్లి కోర్టులో అంబటి కేసులో ముగిసిన వాదనలు.. కాసేపట్లో తీర్పు

Sankranti Lucky Draw Case Ambati Rambabu in Court
  • సంక్రాంతి లక్కీ డ్రా కేసు
  • సత్తెనపల్లి కోర్టులో అంబటిని ప్రవేశపెట్టిన పోలీసులు
  • కోర్టు తీర్పుపై నెలకొన్న ఉత్కంఠ
సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఇబ్బందులు తప్పలేదు. తనపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్ పొందిన అంబటికి... ఈ కేసు మరో తలనొప్పిగా మారింది. ఈ కేసులో ఆయనను పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన సత్తెనపల్లి పోలీసులు... ఇవాళ సత్తెనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాసేపటి క్రితంమే ఈ కేసుకు సంబంధించి ఇరువైపుల వాదనలు ముగిశాయి. కాసేపట్లో జడ్జి తీర్పును వెలువరించబోతున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రిమాండ్ విధిస్తే... మళ్లీ ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారు.

2023 సంక్రాంతి సమయంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లను అంటగట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Ambati Rambabu
Sankranti Lucky Draw
Sattenapalli
YSRCP
Janasena
Court Case
Andhra Pradesh Politics
PT Warrant
Rajahmundry Central Jail

More Telugu News