మధుయాష్కీకి అస్వస్థత.. ఛాతీ నొప్పితో కూలబడిన కాంగ్రెస్ నేత!

  • కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్‌కు తీవ్ర అస్వస్థత
  • తెలంగాణ సచివాలయంలో ఉన్నట్టుండి కూలబడిన వైనం
  • తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కూలబడిన యాష్కీ
  • ప్రథమ చికిత్స అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఆయన సచివాలయానికి విచ్చేశారు. సాయంత్రం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయంలో ఉండగా ఛాతి నొప్పి రావడంతో ఒక్కసారిగా కూలబడిపోయారు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఆందోళన చెందారు.

వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది మరియు ఇతర వ్యక్తులు ఆయన వద్దకు చేరుకున్నారు. తక్షణమే సచివాలయంలోని డిస్పెన్సరీ వైద్య సిబ్బందితో ఆయనకు చికిత్స అందించారు. ఆ తర్వాత, మధుయాష్కీని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.


More Telugu News