మ్యాచ్ మధ్యలో జెర్సీ ఫిరాయించిన పాక్ అభిమాని.. వీడియో ఇదిగో!
––
భారత్, పాక్ జట్ల మధ్య దుబాయ్ లో నిన్న మ్యాచ్ జరుగుతుండగా పాకిస్థాన్ అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ జట్టు ఆటను చూసి ఓటమి తప్పదని గుర్తించిన సదరు అభిమాని అప్పటికప్పుడు తన జెర్సీని మార్చేసుకున్నాడు. అప్పటి వరకు పాక్ జెర్సీ ధరించి దిగులుగా ఉన్న ఆ అభిమాని.. వెంటనే పాక్ జెర్సీపైనే టీమిండియా జెర్సీ ధరించి సంతోషంతో చిందులేశాడు. దీంతో సోషల్ మీడియాలో కామెంట్లు, మీమ్స్ పుట్టుకొచ్చాయి.