ముచ్చెమటలు పట్టించే హారర్ థ్రిల్లర్ .. ఓటీటీలో!
- తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్
- ఈ నెల 12 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- ఆసక్తిని రేకెత్తించే కంటెంట్
- తెలుగులోను అందుబాటులోకి వచ్చే ఛాన్స్
హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలకు ఇప్పుడు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఈ తరహా కంటెంట్ కి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ సంస్థలు ముందుకు వెళుతున్నాయి. అలా ఇప్పుడు ఓటీటీకి వచ్చిన మరో హారర్ థ్రిల్లర్ గా 'జన్మ నచ్చతిరమ్' (జన్మ నక్షత్రం') కనిపిస్తోంది. ప్రధానమైన పాత్రధారి జన్మ నక్షత్రంతో ముడిపడిన కథ ఇది. తమిళంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
మణివర్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 18వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ జోనర్ పట్ల ఆసక్తిని చూపించే ప్రేక్షకుల నుంచి ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. తమన్ అక్షాన్ .. మాల్వి మల్హోత్రా .. అరుణ్ కార్తీ .. కాళీ వెంకట్ .. వేల రామమూర్తి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ప్రస్తుతం ఇతర భాషలలోనే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కథ విషయానికి వస్తే .. అజయ్ - రియా భార్య భర్తలు. రియాకి తరచూ ఒక పీడకల వస్తూ ఉంటుంది. ఆ కలలో ఆమెకి ఏవో కొన్ని భయంకరమైన చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అజయ్ కి చెప్పినప్పటికీ అతను లైట్ గా తీసుకుంటాడు. ఈ నేపథ్యంలోనే అజయ్ మిత్రబృందంలోని ఒక వ్యక్తి చనిపోతూ, తాను దాచిన కోట్ల కొద్దీ డబ్బును తన కూతురుకు అప్పగించమని ఫ్రెండ్స్ కి చెబుతాడు. ఆ డబ్బు కోసం అజయ్ స్నేహితులతో పాటు రియా కూడా వెళుతుంది. తన కలలో తరచూ కనిపించే చిత్రాలను అక్కడ చూసి ఆమె భయపడిపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.