ఆదిలాబాద్‌లో కుప్పకూలిన కలెక్టరేట్ భవనం పైఅంతస్తు

  • గురువారం రాత్రి ప్రమాదం
  • స్లాబ్ నెమ్మదిగా కూలడంతో తప్పిన ప్రమాదం
  • బయటకు పరుగు తీసిన ఉద్యోగులు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలోని పై అంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి పైఅంతస్తు స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు అప్రమత్తమై ప్రమాదం నుండి తప్పించుకున్నారు. స్లాబ్ కూలుతున్న శబ్దం విన్న ఉద్యోగులు వెంటనే భవనం నుంచి బయటకు పరుగులు తీశారు.

కలెక్టరేట్‌లోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం ఉండటంతో ఉద్యోగులందరూ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


More Telugu News