నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ .. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందన
- శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
- దేశానికి చేసే సేవలో విజయం సాధించాలని ఆకాంక్ష
- ఆయన అంకితభావం, సుదీర్ఘ అనుభవం దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా చేస్తాయని విశ్వాసం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీ.పి. రాధాకృష్ణన్ విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వై.ఎస్. జగన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, “రాధాకృష్ణన్ గారూ, మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా హృదయపూర్వక అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశకంగా పని చేస్తాయి,” అని పేర్కొన్నారు.
సి.పి. రాధాకృష్ణన్ భారత రాజకీయాలలో అనుభవం కలిగిన నాయకుడు. ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నిక దేశానికి అనేక విషయాలలో సహాయపడుతుందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన రాధాకృష్ణన్, విపక్షాల మద్దతుతో కూడిన అభ్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు.