ఒక మూగ బాలికను రక్షించలేకపోయింది ఈ ప్రభుత్వం!: రోజా
విశాఖపట్నంలో మతిస్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేత రోజా తీవ్రంగా స్పందించారు.
"ఒక మూగ బాలికను కూడా రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది మంచి ప్రభుత్వమా? రాక్షస ప్రభుత్వమా చంద్రబాబు గారూ? విశాఖపట్నం సీతమ్మధారలో మూగ బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడడం మీ అసమర్థ పాలనకు నిదర్శం కాదా?" అంటూ రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.