హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం... స్టంట్లు చేయవద్దని పోలీసులు హెచ్చరికల జారీ

  • నిర్దేశించిన మార్గాల్లోనే గణపతి విగ్రహాలు తీసుకు వెళ్లాలి
  • ఘర్షణలకు తావులేకుండా శోభాయాత్రలో పాల్గొనాలి
  • కత్తులు, ఇతర మారణాయుధాలతో విన్యాసాలు చేయడం నిషేధం
  • వాహనాలతో స్టంట్లు చేస్తే చర్యలు ఉంటాయి
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం కన్నుల పండువగా జరిగే ఈ నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. గణపతి నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. భక్తులకు, ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.

- నిర్దేశించిన మార్గాల్లోనే గణపతి విగ్రహాలు తీసుకువెళ్లాలి.
- ఘర్షణలకు తావులేకుండా శోభాయాత్రలో పాల్గొనాలి.
- కత్తులు, ఇతర మారణాయుధాలతో విన్యాసాలు చేయడం నిషేధం.
- వాహనాలతో స్టంట్లు చేస్తే చర్యలు ఉంటాయి.
- రోడ్లపై వెళుతున్న వారిపై రంగులు చల్లొద్దు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించవద్దు.
- నిమజ్జన ఊరేగింపు వాహనాల్లో కత్తులు, మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లడం నిషేధం.
- విద్యుత్ వైర్లను స్వయంగా తొలగించే ప్రయత్నం ప్రమాదకరం.
- ఆసుపత్రులు, ఇతర నిషేధిత ప్రాంతాల్లో భారీ శబ్దాలతో ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు ఉంటాయి.
- ఎవరైనా అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తిస్తే 'డయల్ 100'కు కాల్ చేయాలి.
- నిష్ఠతో శోభాయాత్ర చేసి గణేశుడి ఆశీస్సులు పొందండి అని పేర్కొన్నారు.


More Telugu News