Chandra Grahanam: ఈ నెల 7న ఆకాశంలో అద్భుతం.. సంపూర్ణ చంద్రగ్రహణం

Lunar Eclipse Watch the Spectacular Celestial Event on November 7
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 7వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8:58 గంటలకు మొదలై 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి, తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం విడవనుంది. నార్త్, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

 ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ కానీ, బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.
Go Back to Shorts
Chandra Grahanam
Lunar Eclipse
Total Lunar Eclipse
November 7 Lunar Eclipse
Blood Moon
Celestial Event
Astronomy
Eclipse Viewing
Space
Science

More Telugu News