అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదు: మంత్రి నారా లోకేశ్

  • టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
  • తొలిసారిగా జగన్ ఇలాకాలో పాగా వేసిన టీడీపీ 
  • జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదని వైసీపీ ఆరోపిస్తోంది.

అయితే పులివెందులలో ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తి ఉండదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గలేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 


More Telugu News