glass bridge: పర్యాటకుల కోసం సిద్ధమైన విశాఖ గాజు వంతెన.. వీడియో ఇదిగో!

Kailasagiri Glass Bridge Visakhapatnam Ready to Thrill Tourists
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నంలోని కైలాసగిరిపై నగరపాలక సంస్థ చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. విశాఖవాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ఈ వంతెన థ్రిల్ పంచనుంది. కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోనే అతి పొడవైనది.

చుట్టూ కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం.. ఇలా వంతెన పైనుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఈ వంతెనపై ఒకేసారి వంద మంది నిలబడవచ్చు. అయితే, ప్రస్తుతం ఒకసారికి 40 మందిని మాత్రమే వంతెనపైకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
glass bridge
Visakhapatnam
Visakhapatnam Kailasagiri
glass bridge
Vizag tourism
Andhra Pradesh tourism
longest glass bridge India
tourism
Vizag

More Telugu News