పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి
- నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ ఎంఈ విజయసాయి
- ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని ఆకాంక్ష
మంగళవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, దేశానికి సేవ చేసే శక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మేరకు #HBDPawanKalyan అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని విజయసాయి చెప్పినప్పటికీ, భవిష్యత్తులో ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పడు పవన్ కు విషెస్ తెలపడం ద్వారా మరోసారి ఆయన తన రాజకీయ భవితవ్యంపై చర్చకు అవకాశం ఇచ్చారు.