'ఓరి నీ పాసుగాల' అంటూ జగన్ పై లోకేశ్ సెటైర్లు
- పులివెందుల పర్యటనలో ఉన్న జగన్
- జగన్ ను కలిసేందుకు పాస్ లు జారీ చేశారనే వార్త వైరల్
- కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా అంటూ లోకేశ్ సెటైర్
ఓరి నీ పాసుగాల! .. అంటూ వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళి అర్పించారు. మరోవైపు, పులివెందులలో జగన్ ను కలవడానికి వైసీపీ వీఐపీ పాస్ లు అందజేసింది అనే వార్త వైరల్ అయింది. దీనిపై నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
"ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే.. చూడలే" అంటూ పోస్ట్ చేశారు.
"ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే.. చూడలే" అంటూ పోస్ట్ చేశారు.