మున్నేరులో మునిగిన లారీ.. వీడియో ఇదిగో!
––
మున్నేరు వాగులో బొగ్గు లారీ బోల్తా పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వత్సవాయి మండలంలో లింగాల వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ నుంచి బొగ్గు లోడుతో జగ్గయ్యపేటకు వస్తున్న లారీ.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లింగాల వంతెన పైనుంచి మున్నేరు వాగులో పడిపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు డ్రైవర్ ను కాపాడారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.