రూ.11 కోట్లు నావైతే వేలిముద్రలు ఉండాలి కదా?: రాజ్ కసిరెడ్డి

  • లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఏమాత్రం లేదన్న కసిరెడ్డి
  • సిట్ చెబుతున్నవి కట్టు కథలని విమర్శ
  • తాను నిర్దోషిని కాబట్టే తప్పుడు ఆధారాలు సృష్టించారని మండిపాటు
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చెబుతున్న విషయాలు సినిమా కథలను మించి ఉన్నాయని  తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కస్టోడియల్ విచారణ పేరుతో తనను అరెస్టు చేశారని ఆయన ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలిపారు. తనపై మోపిన అభియోగాలను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ, "లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర ఎక్కడా లేదు. నా తప్పు లేకపోయినా, తప్పు చేసినట్లుగా నాపై తప్పుడు ఆధారాలను సృష్టించారు" అని ఆరోపించారు. తనపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో ఏ కేసులోనూ అరెస్టు కాలేదని ఆయన గుర్తుచేశారు. సిట్ అధికారులు చెబుతున్న కట్టుకథలు నమ్మశక్యంగా లేవని ఆయన అన్నారు.

రూ.11 కోట్ల నగదు గురించి ప్రస్తావిస్తూ, "ఆ రూ.11 కోట్లు నిజంగా నావే అయితే, వాటిపై నా వేలిముద్రలు ఉండాలి కదా? అసలు అంత పెద్ద మొత్తంలో నగదు ఒకే వ్యక్తి దగ్గర ఉంటుందా?" అని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారించారని, వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనకు పరిచయం లేదని ఆయన తేల్చిచెప్పారు. "కేసులో ప్రస్తావిస్తున్న చాలా మంది పేర్లను నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నాను. సిట్ విచారించిన వారిలో కనీసం ఓ ఐదుగురిని పిలిచి, నేను తెలుసా అని అడగండి" అని ఆయన కోరారు. 


More Telugu News