'ఒకే ఒక్క మెగాస్టార్'.. మామయ్యపై ప్రేమను చాటుకున్న అల్లు అర్జున్
- చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
- మామయ్యతో దిగిన ఫొటోను షేర్ చేసిన బన్నీ
- ఖుషీ అవుతున్న మెగా, అల్లు ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో హోరెత్తుతోంది. అయితే, ఈ శుభాకాంక్షల వెల్లువలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ పోస్ట్ ఫుల్‌స్టాప్ పెట్టిందనే చర్చ మొదలైంది.
చిరంజీవితో కలిసి ఓ కార్యక్రమంలో ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న పాత ఫోటోను పంచుకుంటూ, "ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సింపుల్ పోస్ట్ మెగా, అల్లు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తన మామయ్య చిరంజీవి అంటే తనకు ఎనలేని గౌరవం అని అల్లు అర్జున్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన 'వేవ్స్' సదస్సులో మాట్లాడుతూ, చిరంజీవి తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశారని, ఆయనే తనకు అతిపెద్ద స్ఫూర్తి అని బన్నీ వెల్లడించారు. ఇప్పుడు పుట్టినరోజున 'ఒకే ఒక్క మెగాస్టార్' అంటూ ఆయన చేసిన పోస్ట్, ఆ గౌరవాన్ని మరోసారి చాటి చెప్పింది.
ఇదిలా ఉండగా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విక్టరీ వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, హరీష్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.