చైనా సరిహద్దుల్లో ఉత్తర కొరియా రహస్య అణు స్థావరం.. అమెరికాను టార్గెట్ చేసే క్షిపణులు ఉన్నాయని అనుమానం
- చైనా సరిహద్దుకు 27 కి.మీ. దూరంలో కొరియా రహస్య అణు స్థావరం
- శాటిలైట్ చిత్రాలతో బయటపడ్డ అణు స్థావరం
- వాషింగ్టన్‌కు చెందిన సీఎస్‌ఐఎస్ నివేదికలో సంచలన విషయాల వెల్లడి
అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పి ఉత్తర కొరియా మరో రహస్య క్షిపణి స్థావరాన్ని నిర్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్థావరంలో అమెరికాను సైతం లక్ష్యంగా చేసుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
సీఎస్‌ఐఎస్ నివేదిక ప్రకారం, ఉత్తర కొరియాలోని నార్త్ ప్యోంగ్యాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ స్థావరం పేరు 'సిన్‌పుంగ్-డాంగ్'. ఇది చైనా సరిహద్దు నుంచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2003 నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించినప్పుడు ఈ స్థావరం నిర్మాణం 2004లో మొదలై, 2014 నాటికి పూర్తయిందని తేలింది. అప్పటి నుంచి ఇది చురుగ్గా పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఉత్తర కొరియా ఇప్పటివరకు ప్రపంచానికి అధికారికంగా వెల్లడించని 15 నుంచి 20 రహస్య క్షిపణి స్థావరాలలో ఇది కూడా ఒకటని సీఎస్‌ఐఎస్ పేర్కొంది.
ఈ స్థావరంలో అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల 6 నుంచి 9 హ్వాసాంగ్-15 లేదా హ్వాసాంగ్-18 వంటి అత్యంత శక్తిమంతమైన క్షిపణులు ఉండే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వీటిని మొబైల్ లాంచర్ల (TEL) ద్వారా ప్రయోగిస్తారని, ఈ క్షిపణులు తూర్పు ఆసియాతో పాటు అమెరికా ప్రధాన భూభాగానికి కూడా పెను ముప్పుగా పరిణమించగలవని హెచ్చరించింది. ఆశ్చర్యకరంగా, అమెరికా-ఉత్తర కొరియా మధ్య గతంలో జరిగిన అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చల్లో ఈ స్థావరం ప్రస్తావనే రాలేదని నివేదిక తెలిపింది.
యుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ క్షిపణులను భూగర్భ స్థావరాల నుంచి బయటకు తీసుకొచ్చి, ముందే సిద్ధం చేసుకున్న ప్రదేశాల నుంచి ప్రయోగిస్తారని సీఎస్‌ఐఎస్ వివరించింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఉత్తర కొరియా క్షిపణి నెట్‌వర్క్‌లో సిన్‌పుంగ్-డాంగ్ స్థావరం కీలకమైనదని, ఇది ఆ దేశం తన అణు సామర్థ్యాన్ని, దాడి చేసే శక్తిని నిరంతరం పెంచుకుంటోందనడానికి నిదర్శనమని నివేదిక అభిప్రాయపడింది.