మహిళలను మభ్య పెట్టే గుండెపోటు సంకేతాలు.. పురుషులతో పోలిస్తే భిన్నం
- గుర్తించడంలో నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందంటున్న నిపుణులు
- ఫలితంగా సమయానికి చికిత్స పొందడం లేదని వెల్లడి
- సాధారణ లక్షణాలతో పాటు చిన్న పనులకే తీవ్రమైన అలసట కూడా గుండెపోటు సూచనేనట
గుండెపోటు.. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే ప్రాణాంతక పరిస్థితి. కానీ, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారూ ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. అరుదుగా స్కూలుకెళ్లే చిన్నారులకూ గుండెపోటు ముప్పు ఎదురవుతోంది. సరైన సమయంలో గుర్తించలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు.
గుండెపోటు లక్షణాల విషయానికి వస్తే స్త్రీ, పురుషుల్లో భిన్నత్వం కనిపిస్తోందని నిపుణులు తాజాగా గుర్తించారు. పురుషులతో పోలిస్తే మహిళలకు ఇతరత్రా సూచనలు కూడా అందుతాయని, అయితే, వాటిని గుర్తించడంలో మహిళలు పొరబాటుపడతారని తెలిపారు. మ్యాక్స్ హాస్పిటల్ వైస్ చైర్మన్, కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ నవీన్ భమ్రీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల్లో గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఈ చిహ్నాలను ఇతర అనారోగ్యంగా పొరబడే అవకాశం ఉంది.
గుండెపోటుకు గురైన వారిలో ఛాతీ నొప్పితో బాధపడడం స్త్రీ, పురుషుల్లో సాధారణం. అయితే, దీనికితోడు మహిళల్లో కనిపించే ఇతరత్రా లక్షణాలు.. చిన్న చిన్న పనులకే తీవ్రమైన అలసట, ఛాతీలో నొప్పి, అసౌకర్యం, వికారం, వాంతులు, శ్వాస అందకపోవడం, మెడ, భుజం, వెన్ను నొప్పి, పొత్తికడుపు పైభాగంలో నొప్పి, తల తిరగడం లేదా మైకం కమ్మినట్టు అనిపించడం వంటివి ఉంటాయి. సాధారణంగా ఈ లక్షణాలు కనిపించినప్పుడు మహిళలు విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని భావిస్తారని డాక్టర్ భమ్రి చెప్పారు. దీనివల్ల సకాలంలో వైద్య చికిత్స అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.