ఛలో అసెంబ్లీకి అనుమతి లేదు: పోలీస్ కమీషనర్
ఛలో అసెంబ్లీకి అనుమతి సాధ్యంకాదని పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఛలో అసెంబ్లీ భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలకు వివిధరకాలైన వ్యక్తులు హాజరవుతుంటారని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అందుకే అనుమతి ఇవ్వట్లేదని తెలిపారు. మిలియన్ మార్చ్, సాగరహారం, సమరదీక్ష సందర్భంగా అనేక ఘటనలు చోటుచేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సాగరహారం సందర్భంగా 34 కేసులు నమోదు చేసామని తెలిపారు. ఛలో అసెంబ్లీని మిలిటెంట్ ఉద్యమంగా మావోయిస్టు నాయకుడు పిలుపు ఇచ్చారని, అతని ప్రకటన చూస్తుంటే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలు ఛలో అసెంబ్లీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని గుర్తించేందుకు నిఘా కేమెరాలు, వీడియో రికార్డింగులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శాసనసభకు రెండు కిలోమీటర్ల మేర ఇప్పటికే ఆంక్షలు అమలులో ఉన్నాయని అనురాగ్ శర్మ తెలిపారు.