నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతి... పవన్ కల్యాణ్, నారా లోకేశ్ స్పందన
- చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతి
- చిన్నారుల దుర్మరణం అత్యంత బాధాకరమన్న పవన్ కల్యాణ్
- చిన్నారుల మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్న నారా లోకేశ్
కర్నూలు జిల్లా చిగిలి గ్రామంలో ఆరుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
చిన్నారుల దుర్మరణం అత్యంత బాధాకరం: పవన్ కల్యాణ్
కర్నూలు జిల్లా చిగిలి గ్రామంలో చోటుచేసుకున్న విషాదం తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ గ్రామంలోని కుంటలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలైన ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తీవ్ర ఆవేదనకు గురి చేసింది: లోకేశ్
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో నీటి గుంటలో పడి శశికుమార్, కిన్నెరసాయి, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే చిన్నారులు మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల బాలలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.