Prabhas: జపాన్‌లో ప్రభాస్ హవా... ప్రముఖ మ్యాగజైన్ కవర్‌పై సోలోగా డార్లింగ్

Prabhas graces Anan Magazine cover in Japan
షార్ట్స్‌లో చూడండి
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్‌ జపాన్‌లోనూ విస్తరిస్తోంది. తాజాగా ఆయన జపాన్‌కు చెందిన ప్రముఖ 'అనన్' మ్యాగజైన్ బ్యాక్ కవర్‌పై సోలోగా మెరిశారు. ఈ నెల‌ 10న విడుదల కానున్న 2483వ సంచికపై ఆయన ఫొటోను ప్రచురించారు. ఈ ఫీచర్‌ను "రాయల్ ఆడియన్స్ గ్రావుర్" అంటూ అభివర్ణించిన మ్యాగజైన్, జపాన్ అభిమానులతో ప్రభాస్‌కు ఉన్న బలమైన అనుబంధాన్ని హైలైట్ చేసింది.

'బాహుబలి' సినిమాతో జపాన్‌లో ప్రభాస్‌కు అభిమానగణం ఏర్పడగా, 'సలార్' చిత్రంతో అది మరింత పెరిగింది. ఇక 'కల్కి 2898 ఏడీ' విడుదలతో ఆయన పాప్యులారిటీ శిఖరస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే 2025 డిసెంబర్‌లో ప్రభాస్ టోక్యోలో పర్యటించినప్పుడు ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు.

భారతీయ నటుడు ఒకరు జపాన్ ప్రముఖ మ్యాగజైన్‌పై సోలోగా కనిపించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. ఈ పరిణామం విదేశాల్లో ప్రభాస్ క్రేజ్‌ను, ఆయనకున్న అంతర్జాతీయ ఇమేజ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయంగా ప్రభాస్ ఇమేజ్‌కు ఇది నిదర్శనమని డార్లింగ్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
Go Back to Shorts
Prabhas
Japan
Anan Magazine
Baahubali
Salaar
Kalki 2898 AD
Indian Cinema
Telugu Cinema
Tokyo
Pan-India Star

More Telugu News