చావు బతుకుల్లో ఉన్న ఛాయాదేవిని ఎవరూ పట్టించుకోలేదట!
- పేద కుటుంబంలో పుట్టిన ఛాయాదేవి
- నాటకాలపై ఆసక్తిని చూపుతూ వచ్చిన వైనం
- సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు
- ఒంటరితనం కారణంగా మోసపోయిన నటి
తెలుగు తెరపై సూర్యకాంతం తరువాత, ఆ స్థాయి గయ్యాళి పాత్రలను పోషించిన నటిగా ఛాయాదేవి కనిపిస్తారు. సూర్యకాంతం - ఛాయాదేవి కాంబినేషన్ లోని సీన్స్ ను ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసేవారు. అలాంటి ఛాయాదేవిని గురించి, సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. " ఛాయాదేవి చాలా పేద కుటుంబంలో పుట్టిపెరిగారు. కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అందువలన ఆమె నాటకాలపై దృష్టి పెట్టారు" అని అన్నారు.
"నిర్మలమ్మతో కలిసి ఛాయాదేవి నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. నిర్మలమ్మకు సినిమాల్లో అవకాశాలు రావడంతో, ఆమె మద్రాస్ వెళ్లిపోయారు. దాంతో ఛాయాదేవి కూడా మద్రాసు చేరుకున్నారు. నాటక అనుభవం ఉన్నవారికి అప్పట్లో ప్రాధాన్యతను ఇచ్చేవారు. అలా సినిమాలలో చిన్న చిన్న వేషాలను సంపాదించుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు 300 సినిమాల వరకూ చేశారు. ఛాయాదేవిగారు వివాహం చేసుకోలేదు. అందువలన ఆమెకి ఒక కుటుంబం లేదు .. ఒంటరిగానే జీవించారు" అని చెప్పారు.
"ఛాయాదేవి తన సంపాదనతో ఇల్లు కట్టుకున్నారు. మిగతా డబ్బును వడ్డీలకు తిప్పేవారు. బిజీగా ఉన్న సమయంలో ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోకపోవడం వలన, అనారోగ్యం పాలయ్యారు. ఆమె ఒంటరి కావడంతో, వడ్డీలకు డబ్బు తీసుకున్నవారు ఎగ్గొట్టారు. ఇల్లును అద్దెకి తీసుకున్నవారు సొంతం చేసుకున్నారు. అలా అనేక ఇబ్బందులతో ఆమె చనిపోయారు. ఇండస్ట్రీలో బాగున్నప్పుడే అంతా పలకరిస్తారు. బాగోలేకపోతే పట్టించుకోవడం మానేస్తారు. ఛాయాదేవి విషయంలోను అదే జరిగింది" అని అన్నారు.