30కి పైగా సినిమాలతో రాని క్రేజ్ .. 'కూలీ'తో వచ్చింది!

  • కన్నడలో స్టార్ హీరోయిన్ గా రచిత రామ్
  • కెరియర్ లో 30కి పైగా సినిమాలు  
  • రజనీ కోసం 'కూలీ' సినిమాలో చిన్న రోల్ 
  • ఆమె నటనకు అనూహ్యమైన రెస్పాన్స్ 
  • అందరి నోటా ఆమె మాటనే

సరైన సినిమా .. సరైన పాత్ర పడితే, అందరూ ఆ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవడానికి ఎంతో సమయం పట్టదని చెప్పచ్చు. సినిమా ఆర్టిస్టులంతా అలాంటి ఒక సమయం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమయం ఇప్పుడు 'కూలీ' సినిమాతో 'రచిత రామ్' తలుపు తట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్లంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. అలా అని చెప్పి ఆమె ఈ సినిమాలో చేసింది కీలకమైన రోల్ కాదు ..  చాలా చిన్న రోల్. 
   
రచిత రామ్ 2013లోనే 'బుల్బుల్' అనే సినిమాతో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె అక్కడి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. కల్యాణ్ దేవ్ జోడీగా 'సూపర్ మచ్చి'తో తెలుగు తెరకి కూడా పరిచయమైంది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన ఆమెను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అలా తన కెరియర్ లో ఇంతవరకూ ఆమె 30 సినిమాలకు పైగా చేసింది. కానీ 'కూలీ' సినిమా ఆమెను గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. 


ఈ సినిమాలో ఆమె సౌబిన్ షాహిర్ సరసన కనిపిస్తుంది. సైమన్ కొడుకుని వలలో వేసుకునే పాత్రలో నటించింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో ఆమె నటన అదుర్స్ అనిపించే స్థాయిలో ఉంటుంది. తెరపై కనిపించేది కొంతసేపే అయినా, ఆమె ప్రేక్షకులను ప్రభావితం చేయగలిగింది. ఈ సినిమా చూసిన తరువాత ఆమెను గురించి సెర్చ్ చేసినవారు ఎక్కువ. రజనీ .. నాగ్ .. ఉపేంద్ర .. ఆమీర్ ఖాన్ .. సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ ఉన్న ఈ సినిమాలో, ఆడియన్స్ ను తనవైపు తిప్పుకోవడం అంటే అంత తేలికైన విషయమేం కాదు. అలాంటి ఒక రేర్ ఫీట్ ను రచిత రామ్ సాధించిందని చెప్పచ్చు. 


More Telugu News